ఆశలు ఆకాశంలోనే..

by Ravi |   (  Updated:2025-06-15 23:46:08  IST  )

Poem

ఆశలు ఆకాశంలోనే..
X

నేనూ మనిషినే

కానీ కొందరి దృష్టిలో

కానే కాదు...

నాకు ఆశలు ఉంటాయి

కానీ అవి ఆకాశంలో ఉంటాయ్...

ఈ దేశంలో నా పేరు మీద

చిల్లి గవ్వ కూడా లేదు

ఒక్క ఆకలి తప్ప

నా కాళ్ళకి చెప్పులు

ఎవరు తొడగరు,

నేనే తొడుక్కోవాలి

మనిషిగా బతికే హక్కు

నాకు ఉంది,

కానీ ప్రభుత్వానికి

నా గొంతు వినిపించే బలం లేదు,

నేనో మచ్చు తునకని

ఎందుకంటే ఈ దేశంలో

ఆకలి వేసి దొంగతనం చేస్తే

నేను చావుని ఎదుర్కోవాలి

అదే ధనవంతుడు బాంకుల్న్ని

హుందాగా దోచుకొని విదేశాలకి

పారిపోయినా శిక్ష ఉండదు.....

నీకు నాకు ఇవన్నీ తెల్సు

అయినా మా బతుకులు ఇoతే

చినిగిన బట్టలు, చింపిరి జుట్టే

మాకు అలంకరణ అయింది

రాజు,

91211 51146

Next Story