ఏది నిజం!

by Ravi |   (  Updated:2025-06-15 23:45:38  IST  )

Poem

ఏది నిజం!
X

భూమి ఎలా ఏర్పడిందని

ఆమె నడిగాను

నమ్మకంతో చెప్పింది

వ్యోమ సీమలోని ప్రేమ భావమంతా

ఘనీభవించి పృథివిగా మారిందట

అందుకే అంతటా వింత కాంతులేనట.

నిజమేనా అని అతడిని అడిగాను

అదేమీ కాదని వాదన చేశాడు

హృదయమేదో విస్ఫోటమై

విశ్వమై మిగిలిందట

సకలమూ శకలాలై,

అనంత శూన్యంలో చెదిరేనట

నిశీధిలో పయనమే

జీవన విధానమట

ఏది నిజం?

ఆశ, నిరాశల నాణెంలో

ఏది మీ ముఖం?

డా.డి.వి.జి. శంకరరావు,

94408 36931

Next Story