- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఆద మరచి నిద్రపోతున్న సమాజాన్ని
సమయానికి సంధి చేయడానికై
అక్షరమొక్కటి మత్తుని గిల్లి
ప్రపంచపు ఆలోచనలని తట్టి లేపింది.
భావానికి బలం నింపి
నరనరాలలో నిప్పురవ్వలు కదిలిస్తూ
సమాజాన్ని మేల్కొల్పడానికై కదులుతున్న
అడుగులకి వెలుగులిస్తుంది.
ప్రపంచంలోని ప్రజల్ని ఏకం చేస్తూ
వర్గ భేదాలని విదిలిస్తూ..
వేల కంఠాలకి ఏక స్వరాన్నిస్తుంది.
పోరాటానికి ప్రాణం పోయడానికే
అక్షర రూపంలో ఆయుధమై వస్తుంది.
ప్రపంచాన్ని అందాల
వర్ణ పల్లకిలో మోయడానికై
కవిత్వం ఆరాటపడుతోంది.
తూటాలనే అక్షరాలను
అవినీతిపరుల గుండెల్లో
దించడానికి కదలి వస్తుంది.
మేల్కొన్నా సమాజాన్ని
వర్ణ పల్లకిలో మోయాలనే
ఎదురుచూపులోనే మిగిలిపోతోంది.
మమత జక్కుల
63055 60132
- Tags
- Poem
Next Story






