చదువులమ్మ ఒడి

by Ravi |   (  Updated:2025-06-16 00:30:56  IST  )

Poem

చదువులమ్మ ఒడి
X

సర్కారు బడి చదువులమ్మ ఒడి

సర్కారు బడి సకల సౌఖ్యాల బడి

ప్రతి బడి ఓ ఆశల కుటీరం

ప్రతి విద్యార్థి వెలుగుకు కారకం!!

మన ఊరు సర్కారు బడి

ఆటపాటల నాట్యాల బడి

ప్రకృతి ఒడిలో ప్రగతి వైపు బడి

సరస్వతి నిలయం సర్కారు బడి!!

విద్యా ప్రగతికి సోపానం

జ్ఞానాలయాలు సర్కారు బడి

ప్రభుత్వ బడులు ప్రగతికి సోపానాలు

పైసల లేకుండా ప్రగతి బడి!!

బడిబాట భవిష్యత్తుకు బాట

బడిబాట భావితరాలకు బాట

ప్రభుత్వ పాఠశాల ప్రగతి బాట

శత శాతం ఉత్తీర్ణత బడి

సక్సెస్ బడి సర్కారు బడి!!

దేవులపల్లి రమేశ్

99637 01294

Next Story