- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
నరుడి తలపైన
ఒక విశాల ప్రాంతం
అందమైన సువిశాల ప్రాంగణం
దానికి ఆద్యంతలు లేవు
సమయ సందర్భాలు లేవు
దాంట్లో ఎన్నో అబ్బురపర్చే వింతలు
మరెన్నో ఆకట్టుకునే అద్భుతాలు..
సమస్త జీవులకు అది నీలాకాశం
పరిశోధకులకు అది సువర్ణాకాశం
కనిపించి కనిపించని నవగ్రహాలు
పరబ్రహ్మ రూపాలు
మిలమిల మెరిసే తారలు
ఆనంద పర్చే తెల్లని మబ్బులు
బెదిరించే మెరుపులు
దగ్గర చేసే ఉరుములు
అప్పుడు కురిసే చక్కనైన చల్లని వర్షం
అప్పుడు విరబూసే
మన అన్నదాతల హర్షం
హరివిల్లుల రంగుల వర్షం
ఒక వర్షం శుభసూచికం
కోటం త్రిశూల్
85230 05678
- Tags
- Poem
Next Story






