నరబలి

by Ravi |   (  Updated:2025-06-16 00:31:26  IST  )

Poem

నరబలి
X

నువ్వెంతటి గొప్పోడివైనా

న్యూస్ పేపర్‌లో, ఛానల్‌లో వార్తలకు

ఒక్క రోజు ఇంధనం మాత్రమే అవుతావు!

అందాల తారల పోటీలు

రాజకీయ నేతల కాట్లాటలు

వెనక తరుముకొస్తుంటే,

నిరంతర ప్రసార పోటీలో

నీకోసం నిజాయితీగా

కన్నీరు పెట్టే తీరిక ఎవరికి వుంది!

నీ మరణ వార్త కూడా

వినిమయ సరుకు కాపోతే

అదికూడా బ్లాక్ అవుట్ అయిపోతుంది !

కోట్లాదిమంది హృదయఘోష

చెవిటివాడి ముందు

ఊదిన శంఖం అవుతుంది!

మనం ఇరవై నాలుగ్గంటలు

కళ్ళప్పగించి చూసే యాంకరమ్మలు,

కార్పొరేట్ కిచెన్‌లో వంటగత్తెలు!

ప్రాయోజిత వార్తలనే వండి వారుస్తుంటారు!

దండకారణ్యం నేడు ఆదివాసీల ఆవాసం కాదు.

అదొక నిధి, నిక్షేపాలగని! నిధులకోసం

నరబలి ఇవ్వడం, 'మన'ధర్మమే కదా!

ఎంతమదిని బలిస్తే అంత లాభాల పంట!

అందుకోసమే సాగుతోంది నరమేధం!

విప్లవ విద్యార్ధి నుండి వీర మరణం దాకా

నీ ప్రయాణం, జనంలో జానపద కధవుతుంది!

వాళ్ళ పాటల్లో చరణమవుతుంది!

నీ సహచరుల చేతిలో ఎర్రజెండా అవుతుంది!

రాబోయే సమసమాజానికి వేగుచుక్కవుతుంది!

(సోషల్ మీడియా సేకరణ)

యస్.జనార్ధన్

Next Story