- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ప్రతి ఇంటా అవతరించలేక
దైవం అమ్మను సృష్టించి పంపాడు.
అడుగో మీ నాన్న అంటూ
చూపించింది అమ్మ.
తానే కనుపాపై
లోకాన్ని చూపించాడు తండ్రి.
వేలు పట్టి నడిపించి
మిట్టపల్లాలు చూపాడు ఆయనే..
తాను ముళ్లబాటలో పయనిస్తూ
కష్టాల కొండల్ని పిండి చేసి
బాధల ఎడారుల్ని నందనవనం చేసి
మనకు పూలబాట పరిచాడు..
జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా,
ప్రత్యక్ష నరకాన్ని కళ్ళజూస్తున్నా,
కన్నీళ్ల సంద్రాలను గుడ్డు వెనకే దాచేస్తాడు,
మన బతుకుల్లో నవ్వులు పూయిస్తాడు..
మింగ మెతుకు లేకున్నా,
బిడ్డకు పరమాన్నం పెడతాడు.
తాను జీర్ణవస్త్రాన్ని ధరించినా,
బిడ్డలకు పట్టుబట్ట ఇస్తాడు.
తనకు సంతకం రాకున్నా
నువ్వు దొరలా ఉండాలంటాడు.
అందుకే...
వరాలిచ్చే వేల్పు దృగ్గోచరం కాకున్నా,
అమ్మతో పాటు నాన్నను పంపిస్తాడు.
ఆయన రుణం ఎలా తీర్చుకోగలం?
ఆయనకు నాన్నగా పుడితే తప్ప.
వేమూరి శ్రీనివాస్
99121 28967
- Tags
- Poem






