వేకువలా వస్తావు

by Ravi |   (  Updated:2025-06-08 23:46:00  IST  )

Poem

వేకువలా వస్తావు
X

చీకటి చెరిపేస్తావు

నగవులు కురిపిస్తావు

ఋతువులు మరిపిస్తావు

ఏకంగా ఈ లోకాన్నే

నాకంగా మార్చేస్తావు

వెలుతురు గుచ్చేవేళ

మెలకువ వచ్చేవేళ

వాకిలి లో ఉంటావు

వీడ్కోలు చెబుతుంటావు

అయినా దిగులు సోకిన పగలంతా

వగచి వృథా చేయబోను

గడిచిన తీపి ఘడియల్ని

గోడల నిండా చిత్రిస్తాను

ఆ కాటుక కళ్ల ఊసుల్ని

పాత్రల్లో నింపి, మళ్లీ

నీ రాకకై చూస్తుంటాను

డా.డి.వి.జి. శంకరరావు,

94408 36931

Next Story