పుష్పక విమానం

by Ravi |   (  Updated:2025-06-09 00:46:11  IST  )

Poem

పుష్పక విమానం
X

నాయిన వలస వచ్చిన పక్షి

నా మాయిముంత ఇక్కడే

ఊరు గొడ్డుదేం కాదు

పుట్టెడు పని

జేబులో తడి లేక

పోగుబట్టిన నాయిన రోజు కూలీ

అది నా వారసత్వం

అప్పటి షావుకారు

జంధ్యం జంధ్యం ఒక్కటే అని

కావలించుకున్నడు

ఇప్పటి షావుకారు

పొరుగింటి పుల్లగూరకు చేయి చాపిండు

నోరు లేని వాళ్ళం

కన్ను తెరువని వాళ్ళం

కూలీ పెంచమను సాహసం

అడుగంటిన వాళ్ళం

భూమి రెండు ముక్కలయినా

వాడు పాలోని లెక్క

పనిలో పొత్తుకొస్తున్నడు

పుష్పక విమానం కూలేటట్టున్నది

నగరమా మహా వృక్షమా

ఇక్కడ ఒక పావురం

తట్టా బుట్టా సర్దుతున్నది

మజ్జిగ పలుచబడ్డదని.

- గజ్జెల రామకృష్ణ

89774 12795

Next Story