- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
పన్నులు ఎగ్గొట్టి
కలుగుల్లో నిలుపుకున్న ధనం
గాదెల్లో నింపుకున్న ధనం
జనం లోకి రాని నల్ల చేపలన్నీ
గాలాలకి దక్కితే
పెద్ద పిట్టలన్ని వలలకి చిక్కితే
ఎంత బాగు
ఆర్థిక ప్రక్షాళన క్రతువు కొనసాగితే
ఒక లాభంతో బాటలే
ఒక శుభంతో అడుగులే
ఇంట్లో పడి దోచుకునే వారు
దారులు కాచి దోచుకునే వారు
దొంగలు కాదు
అసలు దొంగలు వీళ్ళు
ముసుగు దొంగలు వీళ్లు
లెక్కల్లో చూపని పైస
పక్కల్లో బల్లెం గానీ
అడ్డుదారులు దొరకక
దొడ్డిదారులు తెలియక
ఎత్తిన కత్తి దిగనీ
గోడల్లో గోదాముల్లో నిధులు
పైగా ట్రస్టుల్లో విధులు
మబ్బులు చెదిరిపోయి
ఆకాశం నిర్మలం కావాలి
మసకలు వీడిపోయి
నేల వెలుగులు నిలపాలి
(కిటికీ లోంచి కరెన్సీ వర్షం వైకుంటనాథ్‌కి )
- కోటం చంద్రశేఖర్
94920 43348
- Tags
- Poem
Next Story






