- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఆకాశాన జాబిల్లి.. సప్తవర్ణాల
పైటేసుకున్నట్లు ఇంద్రధనుస్సు!
చూసిన నేలమ్మ
మురిసి ముద్దాడడానికన్నట్లు
ఎక్కడో అల్లంత దూరాన
ఆకాశాన్ని అందుకునే ప్రయత్నం!
ఫక్కున నవ్విన చుక్కలు
పారవశ్యానికి హద్దులుగా
పరవశించిన మేఘాలు
పులకరింతతో కురిసిన హ(వ)ర్షం!
నేల పగుళ్ళ సందుల్లో
బందీలయిన నీటి చుక్కలు
బీళ్లన్నీ చిరునవ్వుతో
చిగురించిన పచ్చిక బయళ్ళు!
చెట్లన్నీ తలలో
పూలు పెట్టుకున్నట్లు
అందంగా ముస్తాబైన ఆకృతి!
ఆనంద హేలలో ప్రకృతి!!
జగ్గయ్య. జి
98495 25802
- Tags
- Poem
Next Story






