వాళ్లకు మనమేమివ్వగలం..

by Ravi |   (  Updated:2025-06-02 01:00:17  IST  )

Poem

వాళ్లకు మనమేమివ్వగలం..
X

వాళ్ళేం తీసుకుపోయారు

కొన్ని పువ్వులను

కొన్ని రాళ్ళను

ఇంకొన్ని బుల్లెట్లను

పిడికిలి నిండా మట్టిని

మాత్రమే కదా?

కొన్నెత్తురుతో ఎగసిపడే

యువతరం ఒకవైపు

తమ మేధస్సుతో

ఉద్యమాన్ని ముందుండి

నడిపిన నిన్నటితరం

ఇరువురి బలిదానాలు

రేపటి తరం కోసమే కదా

వాళ్ళేం తీసుకుపోయారు

కొన్ని కన్నీళ్లను

మన గుండెల్లో దాగిన భయాన్ని

నీ నా లోని సంకోచాన్ని

మనలోని అధైర్యాన్ని పోగొడుతూ

తరలిపోయారు

వాళ్లకి మనమేమివ్వగలం

చెప్పగలవా?

కెక్యూబ్

94934 36277

Next Story