వసంత మేఘ గర్జన

by Ravi |   (  Updated:2025-06-01 23:45:30  IST  )

Poem

వసంత మేఘ గర్జన
X

వసంత కాలపు తొలకరి జల్లయి

మీరు మమ్ముల

స్పర్శించి పోతారు కదా

నల్లరేగడి నేలలో విత్తిన విత్తనంలో

మీరు మొలకెత్తుదురు వనమై కదా

వీచే పైరు గాలి సవ్వడయి

మాతో మీరు నిత్యం

ముచ్చటిస్తారు కదా

ఆ పొడిసే పొద్దు పొడుపై

మా గుమ్మాల్లో మీరు వెలుతురై

ప్రకాశించుదురు కదా

నిన్నటికి నేటి స్వప్నాన్ని

చెరపాలనుకున్న చోట

మీరు భవిష్యత్తుకు

బాట చూపిన వాళ్ళు కదా

పసి పిల్లల బోసి నవ్వులై

మీరు మా ఎద యందు

ఉందురు కదా

మా నుండి మిమ్మల్ని

యడబాపాలనుకున్న చోట

నిత్యం వసంత మేఘం

ఉరుమై గర్జిస్తుంది.

-వంగల సంతోష్

95737 86539

Next Story