పలకరింపు!!

by Ravi |   (  Updated:2025-06-02 00:31:11  IST  )

Poem

పలకరింపు!!
X

ఫోన్ మళ్లీ మళ్లీ మోగింది

ఎక్కడో ఎవరికో

ఏదో అవసరం పడ్డట్టుంది

వాట్పప్ నిండా తీయని మాటలు

వర్షంలా కురిశాయి..

ఎవరో నిన్ను

వాడుకోవాలనుకుంటున్నారు

మానవ సంబంధాలన్నీ

మాయమైన వేళ

అవసరానికైనా మనల్ని

పలకరించే మనుషులున్నారని

పరమానంద పడిపో మిత్రమా.!

భవిష్యత్తులో మన మాటామంతీ

మైత్రీబంధం అన్నీ రోబోలతోనే !!

-వెన్నెల సత్యం

94400 32210

Next Story