హామీ ఇవ్వాలి

by Ravi |   (  Updated:2025-06-02 00:16:06  IST  )

Poem

హామీ ఇవ్వాలి
X

చిగురుల్ని తెంపనని

వేర్లకు హామీ ఇవ్వాలి

శ్వాసలను ఆపేస్తూ

లేపనాలను పూసే

తంతు ఆగిపోవాలి

దేశం లోపలి హింస

దేశం అంచున యుద్దం

రెండింటికి క్రాంతదర్శనం కావాలి

హక్కులను తొక్కేయకుండా

ప్రశ్నలకు కూడా చోటుండాలి

మండాది గోపీనాథ్

98850 45344

Next Story