అమరుల త్యాగం తెలంగాణం

by Ravi |   (  Updated:2025-06-02 01:00:17  IST  )

Poem

అమరుల త్యాగం తెలంగాణం
X

వీరుల త్యాగాల ఫలితమిది.

ఉద్యమాల పొరుగడ్డఇది.

విద్యార్థి నిరుద్యోగుల కల

సాకారమైన సమయమిది.

ఊరువాడ పల్లె పట్టణం ఒక్కటై

సాధించుకున్న శుభదినమిది.

కాలికిగజ్జెకట్టి చేతిలో జెండాపట్టి

జైతెలంగాణ అని నినదించిన నేల ఇది

అభివృద్ధి నినాదాన్ని అందుకొని

పరుగులు తీస్తున్న

పదకొండు సంవత్సరాల తెలంగాణఇది.

సబ్బండవర్గాల సంబరమిది.

చల్లనిగాలి ఆహ్వానాన్ని పంపగా...

తెలంగాణ నేలంతా...

ఆవిర్భావ పండుగ.

సేద్యంలో చిరునవ్వుల

సవ్వడులు వినిపించాలి.

జననినాదమై ప్రగతి

పరుగులు పెట్టాలి.

కర్షకుడి కన్నీరు తుడవాలి.

అమరుల త్యాగం

చైతన్య గీతమై మ్రోగాలి.

నిరుద్యోగం రూపుమాపి...

ఉద్యోగాల పంటపండాలి.

నిరుపేద చెమటచుక్కకు

ప్రతిఫలం దక్కాలి.

అభివృద్ధి ప్రతి ఇంటి

కడపతొక్కాలి.

ఆశయాల తెలంగాణ

అందరికి విజయాన్ని ఇవ్వాలి.

జయజయహే తెలంగాణ...

జయం జయం తెలంగాణ.

(తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా)

అశోక్ గోనె

94413 17361

Next Story