జాగ్రత్త బిడ్డా...!

by Ravi |   (  Updated:2025-05-26 00:30:56  IST  )

Poem

జాగ్రత్త బిడ్డా...!
X

ఇక్కడ మేక వన్నె పులులు ఉంటాయి

ఆదమరిస్తే బతుకును ఆవలిస్తాయి

ఇక్కడ గోడకు చెవులు ఉంటాయి

విస్మరిస్తే వెన్నుపోటుకు సిద్ధమవుతాయి

జాగ్రత్త బిడ్డా...

కాస్మోటిక్ కల్చర్ నిన్ను

ఒక 'సరుకు'గా మార్చేస్తుంది

కార్పోరేట్ సిస్టం

మరయంత్రంగా మలిచేస్తుంది

ఇక్కడ నాణేనికే కాదు

మనుషులకు రెండోవైపు ఉంది

జాగ్రత్త బిడ్డా...

మానవత్వం, మంచితనం

ఇక్కడ అంతరించే దశలో ఉంది

శ్రీనివాస్ కాలె

90594 50418

Next Story