- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
పువ్వునెవరో తెంపుకెళ్ళారు
ఆ కొమ్మ ఇప్పుడు ఒంటరి
పూలేనా! ఆకులూ రాలాయి
ఆ చెట్టుపై చూపులెవరివీ వాలడం లేదు
కలంలో సిరా ఇంకిపోయింది
కన్నీటిని కలిపి
అతడు రాసిన కథ "ఆకలి"
అది ఏళ్ల నాటి పాతపుస్తకం
అందులో ప్రతి అక్షరం నిత్య నూతనం
నల్లబల్ల దుఃఖిస్తోంది
అక్షరాలపై వాన దాడి చేసింది
నగరంలో వర్షం పడింది
చల్లగాలొచ్చి పల్లెలో చాటింపేసింది
ఆ ఇల్లెప్పుడూ... నిశ్శబ్దం!
అందరినోళ్లకు తాళం వేసింది చరవాణి
సెల్ చూస్తే గాని వాడికి ముద్ద దిగదు
అన్నం తినిపించే యంత్రం అమ్మ
వేసవి సెలవులిచ్చారు!
బడులు గువ్వలు లేని గూడులు
వేసవి సెలవులు ముగిసాయి!
విద్యార్థుల కళ్ళల్లో
మళ్లీ వానలు మొదలు.
ఎ. నాగాంజనేయులు
99590 17179
- Tags
- Poem
Next Story






