విత్తనం పుట్టక మానదు...

by Ravi |   (  Updated:2025-05-26 01:01:03  IST  )

Poem

విత్తనం పుట్టక మానదు...
X

నెత్తురొడ్డుతున్న నేలపైన

విత్తనము పుట్టక మానదు

పదనెక్కుతున్న భూమిపై

వసంతమై చిగురుస్తుంది.

ఈ నేలపై నిండు త్యాగం

పురిటి నొప్పుల దారిలో

పురుడు పోసుకుంటూనే ఉంటుంది

కాలం కౌగిలిలో

గింజుకుంటున్న హృదయాలు

చరిత్ర దారిలో చెదిరిపోవు

ఆకాశమంత

తూర్పు కిరణాలు ప్రసరిస్తాయి.

ఎర్ర పూల వనములో

పిడికిళ్లు బిగుసుకుంటాయి

త్యాగాల దారిలో

బాలసాని రాజయ్య

94419 70025

Next Story