- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
తను పువ్వులని
అమితంగా ప్రేమించినప్పుడే
తనకు మనుషులన్నా
బాగా ఇష్టమని
గుర్తించలేకపోయాం కదా
తను అలా గల గల
పారే సెలయేరులా
నవ్వుతూ మాటలు
కలుపుతున్నప్పుడే
అనుమానపడి వుండాల్సింది
భూమిపై సెలయేటి
సవ్వడిగా మారుతుందని
తను గుంపులు గుంపులుగా
పావురాల గుంపులా
ఎగురుతున్నప్పుడే
ఆపి వుండాల్సింది
తను జనంతో కలిసిపోతుందని
విజ్జి భూమికగా
మారి చివరాఖరి
చూపుకు తను దూరమయ్యాక
ఈ గోస తీరుతుందా
మరల ఈ అమ్మ పేగును
ముద్దాడుతుందా?
అమవాస చీకటిలో
తానిప్పుడు
వెలుతురు పిట్టగా
మారి మా కనుపాపలో
చూపుగా తిరిగి వస్తుందా?
భూమికా
ఈ మట్టిని ముద్దాడిన
నీ రక్త వర్ణ నుదుటిని
చివరిగా ముద్దాడని
(విజ్జి @భూమిక స్మృతిలో)
కుమార్ వర్మ
- Tags
- Poem
Next Story






