- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

మతాన్ని కాదు మానవత్వాన్ని చూడు..
కులాన్ని కాదు గుణాన్ని చూడు..
భాషను కాదు భావాన్ని చూడు..
వ్యక్తిని కాదు వ్యక్తిత్వాన్ని చూడు..
బంధుత్వాల్ని కాదు
అనుబంధాన్ని చూడు..
హోదాను కాదు చేసే పనిని చూడు..
ఆస్తిపాస్తుల్ని కాదు
ఆత్మ సంతృప్తిని చూడు..
చీకటిని కాదు వెలుతురును చూడు..
చెడును కాదు మంచిని చూడు..
సమస్యల్ని కాదు పరిష్కారాల్ని చూడు..
బాధల్ని కాదు వచ్చే సంతోషాల్ని చూడు..
గతాన్ని కాదు వర్తమానాన్ని చూడు..
నినాదాన్ని కాదు ప్రయోజనాన్ని చూడు..
మాటల్ని కాదు చేతల్ని చూడు..
గమ్యాన్ని కాదు గమనాన్ని చూడు..
ఫలితాన్ని కాదు ప్రయత్నాన్ని చూడు..
భిన్నత్వాన్ని కాదు ఏకత్వాన్ని చూడు..
ద్వేషంతో కాదు ప్రేమతో చూడు..
అపనమ్మకంతో కాదు నమ్మకంతో చూడు..
అసత్యాన్ని కాదు సత్యాన్ని చూడు..
ఇతరుల్ని కాదు నీలో నిన్ను చూడు..
మంద అశోక్ రెడ్డి
99590 46499
- Tags
- Poem






