తూరుపు కిటికీ

by Ravi |   (  Updated:2025-05-19 00:00:16  IST  )

Poem

తూరుపు కిటికీ
X

కొక్కొరోకోమని కూసే కోళ్లు

నగరంలో ఎక్కడా కానరావు

అలారం మోత మోగించే

గడియారం మా ఇంట్లో లేదు

ఐనా సూర్యోదయానికి ముందే

నాకు మెలకువ వచ్చేసేది

వంటింట్లోంచి ఘుమఘుమలొచ్చి

ముక్కుపుటాలను తాకినప్పుడు..

అమ్మ చేతి కాఫీ మహిమ అది!

ఇప్పుడు ఆమె వెళ్లిపోయింది

ఆ బాధ్యతను పడగ్గదిలోని

తూరుపు కిటికీ తీసుకుంది!

–శర్మ సీహెచ్‌

94405 87567

Next Story