- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఆమె హైదరాబాద్ వస్తుంది
నా ఆనందానికి అవధుల్లేవు
ఊరూరా తిప్ప వచ్చని కన్నాను కలలు
చార్మినార్ వెలుగుల్లో
ఆమెను నడిపిస్తూ గాజులు
కొనిపించాలనుకున్నా కుదరదన్నారు
ఓ ఫోటో షూట్‌కి మాత్రమే
అనుమతి అన్నారు
ఆమెను ఓ బొమ్మలా
మాత్రమే చూడమన్నారు
ఆమె వంపుసొంపుల
అందం నేను చూడలేదు
మనిషిగానే చూసాను
ఆమెను పొట్టి గౌనులో చూడలేను
విపణి వీధిలోవాడు కురచ బుద్ధితో
కొలతలేసి వ్యాపారం చేస్తున్నాడు
చేనేతలో ఆమె ముస్తాబు వాడికి కాసులు
కురిపిస్తోందని ఊదర కొడుతున్నాడు
ఆమె నడకలో కులుకులు చూసే
జడ్జిల ముందు ఆమె
అంగడి సరుకై నవ్వుతుంది
నేనేమో తల దించుకున్నా
సభ్య సమాజంలో ఒకడిగా
అందం ఆమెదేనా
విరగబూసిన మల్లెల్లో లేదా!
అడవంతా రాలిన ఇప్పపూవులో లేదా!
అడవికి నెత్తుటి మరకలందించి
దోపిడీ చేయబడుతున్న
ఆదివాసీ అందం వేదిక నెక్కజాలదుగా
టేకు ఆకుల సవ్వడిలో నైపుణ్యం లేదా?
నాట్యం చేసే మయూరాల్లో
లేని అందాన్ని కొలుస్తున్న నగరాన్ని
చూస్తుంటే జాలి కలుగుతుంది!
-గిరి ప్రసాద్ చెలమల్లు
94933 88201
- Tags
- Poem






