ఓ బాధిత అంతరంగం

by Ravi |   (  Updated:2025-05-19 00:00:46  IST  )

Poem

ఓ బాధిత అంతరంగం
X

ఒక వైపు

బాధ్యత తెలియని భర్త

మరో వైపు

తన కుటుంబం

సంతులనం చేస్తూ...

కష్టాల కత్తులపై తన

జీవన ప్రయాణాన్ని సాగిస్తుంది.

మార్పులేని జీవితం

మసిపడుతున్న కలలు!

అహంకారపు పోకడలు

ఆంబోతులా మృగాడు!

సంతోషం వస్తుందేమోనని

ఎన్నో వసంతాలకై

ఎదురుచూపులు

ఎడారిలో ఒయాసిస్సులు

కనిపించలేదు!

ఉందో లేదో తెలియని

స్వర్గాన్ని తలుచుకుంటూ

నరకాన్ని భరిస్తూ తాను!

ఇష్టాలను సంకెళ్లతో బందిస్తూ

ఇష్టంగా సంసారం చేయడమా

తెంచుకొని తనకు నచ్చిన

మార్గాన్ని ఎంచుకోవడమా!

కాలం నిర్ణయిస్తుందా

కాలాన్ని ఎదిరించి

నిర్ణయిం తీసుకోవాలా?

జగ్గయ్య. జి

98495 25802

Next Story