- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నిశీధి మేఘాలు కమ్ముకున్నప్పుడు
గుండె పగిలిన శబ్దం
అచేతనమైన కన్నులను పొడుస్తుంది.
మాటలు కోల్పోయిన
గాజుల తడిలోంచి
ఊపిరి; ముక్కలై రాలుతుంది.
దృశ్యాలు... రక్తపు కన్నీళ్లలో
తేలుతున్న నిశ్శబ్ద గాథలు.
ఆమె ఆక్రందనలో,
నా దేశం; పచ్చి బాలింత.
ఆమె శోకమయ నేత్రాల
లోయల నుండి
ఒట్టిపోయిన నదుల్లోకి
భయకంపిత చరిత్ర
తర్జుమా అవుతోంది.
తను కోల్పోయింది
బిడ్దనో, భర్తనో కాదు.. నమ్మకాన్ని
తనది భయం కాదు
భరోసా లేనితనం
ఓ అరాచక అనిశ్చితి
కలల పునాదిని నేలమట్టం చేసింది.
నిరవధిక అబద్దపు ఆప్తవాక్యం.
పెదవులపై దేశాన్ని మోస్తూ
అతని మృత పాదాల కింద నలిగిన
మూడు రంగుల జెండాకు
ఉగ్రవాద పాటను రచించిన వాడికి
నక్షత్రం లేని సగం కోసిన చందమామ.
లిప్తకాలపు అలజడిలో గర్భస్రావమై;
బిడ్డను కోల్పోయిన అనాథ భారతదేశం.
చీము, నెత్తురు, ఉమ్మునీటిలో
తడిసిన రిక్త దేహాలు నా దేశ ప్రజలు.
వాడికి, వీడికి
కావాల్సింది మతోన్మాద ఉగ్రవాదం
కొట్టుకుందామా?
కలిసి పోరాడదామా?
జాని తక్కెడశిల
72595 11956
- Tags
- Poem






