- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఆకు తెంపితే ఏడవ కుండా
అమ్మలా నీకు పాలు ఇచ్చిన
కడుపు నొప్పి బాధలకు
కమ్మనైనా మందు అయిన
అమ్మను రా నేను
జిల్లేడు కొమ్మను రా
తెంపినా ఆకునే ఔషధంగా
సెగ గడ్డకి అడ్డు పడ్డ
అడవిలో నే విస్తరి అయి
అన్నానికి మూట అయిన
వాస్తవాలు తెలియకుండా వాస్తు అని
ఇంటి నుండి తరిమి కొడితివి
నోరు లేని నా గోడు విని
ఆ పరమ శివుడే అభయమిచ్చి
గణ నాధుని చెంత చేర్చే
పత్రి లో ఒక పత్రమై
తొక్కిన నీ చేతులె మొక్కుతూండేనా
కక్ష లేవి పెట్టుకోక రక్ష ఇచ్చేదరా
అమ్మను రా... జిల్లేడు కొమ్మనురా
నక్క శ్రీనివాస్
9848613844
- Tags
- Poem
Next Story






