యుద్ధం వద్దు!

by Ravi |   (  Updated:2025-05-05 00:31:16  IST  )

Poem

యుద్ధం వద్దు!
X

నేతలు యుద్ధాన్ని పండిస్తారు, పోషిస్తారు

ప్రజల్ని మృత్యుముఖాన పడేస్తారు

చచ్చేది చెడేది ఇరు దేశాల అమాయకులు

ఉపాధి పేరిట నియమితులైన

దేశ రక్షకులూ, పేద ప్రజలూ...

అంతా కావాలి ఆహుతి

నిన్నటి వరకూ ఆత్మీయ మిత్రులు

నేడు మతాల మత్తులో

మారిన బధ్ధ శతృవులు

దేశమంతా ఒకరితో

ఒకరు యుద్ధం చేస్తూ

జీవితాన్ని నరకం చేస్తూ

లాభం పొందే

ఇరు దేశాల నాయకులు

ఇరు దేశాలకూ క్షిపణులు

అందించే అగ్ర రాజ్యాలు

యుద్ధం ఒక క్రికెట్ మ్యాచ్ కాదు

జబర్దస్త్ షో అసలే కాదు

దేశాలను ధ్వంసం చేసే మారణకాండ

హీరోషిమా, నాగసాకీల

అనంత శోకం

యుద్ధం ఇప్పుడు

ఒక అణ్వాయుధాల ప్రయోగశాల

యుద్ధం ఎప్పుడూ

చివరి అస్త్రం కావాలి

రోజువారి జీవితంలో...

యుద్ధం ఎప్పటికీ ప్రమాదమే

ప్రజల ఆరోగ్యం, విద్య

దేశ ఆశయం కావాలి

అవే దేశాభివృద్ధికి మూలం కావాలి

యుద్ధం ఒక వినాశనం

యుద్ధం ఒక విధ్వంసం

యుద్ధం అమానవీయం...

అసలే వద్దు

సర్వమంగళ

89616 26848

Next Story