- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నవ వధువు...
జీవితం వికసించబోతున్న రోజులు
ఐదవ రోజే..
తన సగ ప్రాణాన్ని కోల్పోయింది.
పహెల్గాం కొండల్లో దాగిన
మబ్బుల కన్నా గాఢమైన శోకం,
ఆమె హృదయాన్ని
మౌనంగా కమ్ముకుంది.
కానీ మాటల్లో మాత్రం వెలుగే వెలుగు,
వేదనలోనూ విశాలమైన శాంతి.
'న్యాయం కావాలి' అంటోంది ఆమె,
కానీ అది పగ లేక నింద కోసమేమీ కాదు.
'సామరస్యం కావాలి'
తడిచిన కన్నీటి మాటల్లోనూ,
ద్వేషానికి తావీయక తీపి ఆశయంతో.
భర్తను కోల్పోయిన రోజునుంచీ
ఒక్కమాట కూడా ఆమె
మతంపై నింద వేయలేదు.
నేడు కొందరు ఎవరిని ద్వేషిస్తున్నారో,
వారి ప్రేమను, ఆప్యాయతనే
ఎలుగెత్తి చాటిందామె
అది మానవతకు నిలువెత్తు నిదర్శనం.
'కశ్మీరీలను నిందించవద్దు' అంటోంది ఆమె,
వేదనకు మతం కారణం కాదని నమ్ముతూ.
జన్మదినం… ప్రేమ దూరమై
జ్ఞాపకాలే మిగిలిన రోజు,
ఆమె మాటలతో శోకాన్ని కాదు
శాంతీ, మానవతా పరిమళం పంచింది.
హిమాన్షీ! నీ మాటలు గుండెను తాకాయి.
నీ ధైర్యం, నీ నిశ్చలత,
నీ సందేశం భవిష్యత్తుకు దిక్సూచి.
'వేదనలో వెలసిన
మానవత్వపు రత్నం నీవు'!
- యండి. ఉస్మాన్ ఖాన్
99125 80645
- Tags
- Poem






