- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
నా చుట్టూ ఉన్న లోకం విరిగి,
నా స్వప్నాలపై పడ్డట్టుంది...
నిన్న మొన్నటి ఆ నవ్వులు,
ఈ రోజు శబ్ధరహిత
అంధకారమై పోయాయి!
మానవ రూపాలు మాయమై,
నా దేహం ముక్కలుగా చీలి,
బాధ గుండెను చీలుస్తోంది!
ఎవరో భూకంపంలా
గుండెల్ని కొట్టుతున్నట్టు,
కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి,
కానీ చూసే చూపులు లేవు!
పువ్వులు ఉదయాలపై వికసిస్తూ,
మకరందం చిందిస్తే ఎంత బాగుండును!
ప్రశాంతమైన రాత్రులు కథలు చెబుతూ,
రేపటి కలలకు ఊపిరిపోస్తే
ఎంత బాగుండును!
కనిపిస్తున్నదంతా అబద్ధం అయితే?
అలా జరిగిపోకుండా ఉండుంటే
ఎంత బాగుండును!
నువ్వు, నేను వెళ్లిపోతే
ఈ విధ్వంసం ఆగిపోతుందా?
అందరూ పోయాక,
ఈ శవాల గుట్టలపై
మళ్లీ ఓ పువ్వు మొలుస్తుందా?
-జ్యోతి మువ్వల
90080 83344
- Tags
- Poem
Next Story






