మనుగడకు ముప్పు

by Ravi |   (  Updated:2025-04-28 00:45:26  IST  )

Poem

మనుగడకు ముప్పు
X

ఉగ్ర మూకలు

ఉనికి చాటుకోవడానికి

ప్రశాంత కాశ్మీరంలో

కాల్పులతో తెగబడ్డారు..

మానవత్వం మరచి

మతోన్మాదంతో మృగాళ్లలా మారి

అమాయక ప్రజలను

బలి తీసుకున్నారు..

సుందర కాశ్మీరం

పర్యాటకులకు స్వర్గధామం

ప్రకృతి ప్రేమికులకు

ప్రాణప్రదం.. కానీ నేడది

ఉగ్ర మూకలకు నెలవు

మత ఛాందసులకు కొలవు.

నిన్న లాల్ చౌక్, నేడు పహల్గాం

నిత్యం ఎక్కడో ఓ చోట

ముష్కరుల దాడుల్లో

విచక్షణ కోల్పోయి

విచ్చలవిడిగా కాల్పులు

జరుపుతున్న ముష్కరుల దాడుల్లో

మృతి చెందుతున్న అభాగ్యులెందరో కదా....

ప్రాణాలు పోయలేని మీకు

ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారంట..

మత విద్వేషంతో మారణకాండ

మనిషి మనుగడకు ముప్పు..

సాటి మానవుల హత్యాకాండ

మత సామరస్యానికి మాయని మచ్చ.

శిరందాస్ శ్రీనివాస్

94416 73339

Next Story