మళ్లీ..

by Ravi |   (  Updated:2025-04-28 00:45:56  IST  )

Poem

మళ్లీ..
X

అరవై దాటగానే అంతా

అయిపోయిందనుకున్నాడు

ఎదురుగ్గా..

ఎనిమిది వందల ఏళ్ల మహావృక్షం

ఎండాకాలంలోనూ

ఎంతోమందికి నీడనిస్తూ....

బోధిసత్వుడిలా కళ్ళుతెరిచాడు

సముద్రాన్ని లంఘించడానికెళ్తున్న

హనుమంతుడిలా

మళ్ళీ బయల్దేరాడు.

- నవీన్

79816 62872

Next Story