అంతా నీలోనే ఉంది

by Ravi |   (  Updated:2025-04-28 00:15:48  IST  )

Poem

అంతా నీలోనే ఉంది
X

అశ్లీలంగా ఎవడో ఎదో వాగాడని

ఆ క్షణం సలసల మరిగే రక్తంతో

మానవ మృగం నువ్వే..

ఆ అశ్లీలం వాగినవాడి నోట్లోనే వుందని

సహనంతో.. చల్లారిన రక్తంతో

కరుణా మూర్తివీ నువ్వే..

సర్వస్వం పోయిందని

పిడుగులాంటి వార్త

నిలువునా కాలిన వృక్షంలా

ఆవరించే దు:ఖం నీదే..

సంపాదించిన సొమ్మేకదా పోయింది

సంపాదించే తెలివి కాదని

చిగురించే ధైర్యం నీదే..

లక్ష్యం లేని కక్షతో.. కసితో

లక్షల మందిని చంపే పథకం వేసి

మత్సరంతో మాటేసి కాటేసే దెయ్యం నీవే..

మనసు మూలాన ఎక్కడో

అయ్యో అనే మూలుగు

అమలుకు అరక్షణం ముందు

ఆపరేషన్ ఆపేశావంటే.. దైవం నీవే..

-డా. దాసరి వెంకటరమణ

90005 72573

Next Story