- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
చూడు!
కదలక రోదించే
ఈ నికృష్ట జీవుల్ని
ఎట్లా
మెడ పట్టి గెంటుతోందో
నిరంకుశ క్రూర విధి
రక్తారుణ
మృత్యుదంష్ట్రా
భీకర గహ్వరం లోకి
పచ్చిక లోని నీలం పువ్వులపై
మెరిసే మంచుబొట్లు
ఆకాశాన అగాధాన్ని
వెలిగించే నక్షత్రాలు
పోతున్నాయి అనివార్యంగా
కొట్టుకుపోతున్నాయి !
నీ ముఖాన్ని నాలోకి తీసుకుంటున్న
ఈ క్షణాలు విశ్వమంతా వెతికినా
మనకి తిరిగి దొరకవు.
(చలం గారి అజరామర కావ్యం "సుధ" లోంచి ఒక బొట్టు)
సేకరణ:
ఎఎన్ నాగేశ్వరరావు
88611 70489
- Tags
- Poem
Next Story






