- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
అక్షరాలను పోగేసి..
నీకు అర్చన చేయాలా?
కవిత్వం అంత అందమైన నీపై
మళ్ళీ కవిత రాయాలా?
ఓ పిచ్చిదాన..
చలం మైదానంలోని
రాజేశ్వరి నీవే
యండమూరి వారి
వెన్నెల్లో ఆడపిల్ల నీవే
వేటూరి నవమల్లిక నీవే
సినారే వన్నెల దొరసానీ నీవే
కవితా లోకాన్ని తన్మయత్వం
చేస్తున్న ఓ సుందరాంగి..!
నీపై అక్షరాలను ఆరబోసి..
సింగారించే భాగ్యం నాకిచ్చావా?
ఇక ఏ కవిత రాయగలను..
ఆ అందాన్ని మించేలా?
ఇక ఏ మాట చెప్పగలను..
నీ అధరాలు మరింత ఎరుపెక్కేలా?
నేను బయట మాత్రమే కవిని చెలి
నీ ముందు మాత్రం
మాట రాని, మాటలు రాయలేని
ఓ మూగ ప్రేమకుడిని, నీ దాసున్ని!
- ఓ ప్రేమికుడు
- Tags
- Poem
Next Story






