- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ప్రేమించు ప్రేమను పొందు
ఎప్పుడు నీ అల్పత్వాన్ని మర్చిపోకు
చుట్టూ జరిగే
మాటలకందని హింసను
దారుణ అసమానత్వాలను
మరిచిపోకు
విషాద పరిస్థితుల్లోనూ
సంతోషాన్ని వెతుకు
అబద్ధాలకోరుకు
అందమేమిటో చెప్పు
సంక్లిష్టమైన దానిని
సాధారణంగానూ
సాధారణమైన దానిని
సంక్లిష్టంగా చూపెట్టకు
మసక వెల్తురులో దారితప్పకు
నీ బలాన్ని గుర్తించు
అహంకారాన్ని కాదు
ఎప్పుడt గమనిస్తూ ఉండు
ప్రయత్నిస్తూ ఉండు
అర్థం చేసుకుంటూ ఉండు
ఎప్పుడూ పారిపోకు.. ఏమారిపోకు
(అరుంధతి రాయ్ "the cost of living" నుండి)
అనువాదం : ఉదయమిత్ర
89196 50545
- Tags
- Poem
Next Story






