- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
బతికన్నంత కాలం ఇప్పటికే
సిద్ధంగా ఉన్న రథాన్ని ముందుకు
మరి కాస్తా తీసుకుపోవడమేగా!
బతుకంతా ప్రేమను గుమ్మరించి
ఈ బంధాన్ని నిలుపుకోవడమేగా
మనం చేయాల్సింది!
కాల మేఘం సృషించే తుపాన్లను
తిప్పితిప్పి వేసే రుతువుల తివాచీపై
మారని మనసును
నిలుపుకోవడమేగా చేయాల్సింది!
ధిక్కార స్వరం గుడ్లరిమి
చూడని..బాగుపడితే చాలని
అనుకోవడమేగా చేయాల్సింది!
నిందలు వేలెత్తి చూపినా
మారని దారిలో నవ్వుతూ
కదలదమేగా మనం చేయాల్సింది!!
తంగళ్లపల్లి కనకా చారి
87908 74028
- Tags
- Poem
Next Story






