భ్రమర ప్రదక్షిణ

by Ravi |   (  Updated:2025-04-21 00:45:35  IST  )

Poem

భ్రమర ప్రదక్షిణ
X

అమరమైన ప్రేమతో

భ్రమరం

పూవుచుట్టూ ప్రదక్షిణ చేస్తే!

పూవు రాలిపోవాలా

తోటమాలి

చెట్టును పెరికివేయాలా?

సాధ్యాసాధ్యాలు గమనిస్తే

ధర్మాధర్మాలు ఆలోచిస్తే

ప్రకృతి ధర్మం తెలిస్తే....!

తోట పరిమళ భరితమే!

కథ ప్రేమ చరితమే!!

జగ్గయ్య. జి

98595 25802

Next Story