కందుకూరి బాట

by Ravi |   (  Updated:2025-04-18 00:01:03  IST  )

Poem

కందుకూరి బాట
X

మడి, ఆచారాలు కలగలిసిన,

నిప్పులు కడిగే వంశంలోంచి

ఉవ్వెత్తున ఎగిసిపడ్డ

సంస్కరణల కెరటమై,

కలాన్ని కత్తిగా పుస్తకాన్ని

డాలుగా ఉపయోగించి,

నవీనయుగ ప్రారంభంలో

తెలుగు సాహిత్యాన

వెలుగులు విరజిమ్మిన

ప్రభాకరుడు మన "వీరేశలింగం".

ప్రాచీన పోకడలను దునుమాడి,

నవీన సమాజానికి బాటలు వేసిన

సంఘసంస్కర్తా ఇతడే.

మూఢాచారాలతో ఛిద్రమైన

మగువుల జీవితాల్లో

ఆశాకిరణాలు రేకెత్తించి,

వెలలేని విలువలతో

మానవత్వానికి చిరునామాయై,

మసకబారిన సంఘంలో

వెలుగులు నింపి,

భాషా, దేశాభివృద్ధులే ధ్యేయంగా

పురోగమించిన

నవయుగ వైతాళికుడూ ఇతడే.

"కందుకూరి" వారు వేసిన

సంస్కరణల బాటలో పయనిద్దాం,

సమాజాన్ని జాగృతం చేద్దాం.

వేమూరి శ్రీనివాస్

99121 28967

Next Story