- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఆ తల్లి హస్తాలు విశాలమన్నారు
దేవత కళ్ళకు గంతలె oదుకన్నారు
ఆమె ముందు అందరూ సమానమన్నారు
న్యాయం చెప్పే దేవాలయమన్నారు
కాని... ఆ అంకితకేది... ఆ తోడు, నీడ
నల్లకోటు చాటున ధవళ వస్త్ర దైన్యం
న్యాయం కోసం శూన్య నేత్రాలా ఆక్రోశo
క్షమించు తల్లి... మా చేతలు ఖాళీగా లేవు
మా వృత్తి కి పరిమితులు కలవు
నీ వేదన ను 'స్వీకరించలేం 'చెల్లి
మమ్ము శపించకు కన్నమ్మ
అయినా... అది నీవు చేయలేవులే...
త్యాగ శీలివమ్మా... అనురాగ శీలవమ్మా
మేము నీ ఖ్యాతిని గానం చేస్తాం..
న్యాయం చేయాలంటే ఆలోచిస్తాం
మా పరిమితులు నీకు తెలుసుగా తల్లి
మన్నించమ్మా.... మన్నించు..
(అంకిత ఘటనను చదివి)
భమిడిపాటి గౌరిశంకర్
94928 58395
- Tags
- Poem
Next Story






