- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

తీర్పులు బూతులుగా అసత్యాలుగా
విద్వేష విషయాలుగా మారితే
దుర్గంధాలుగా వ్యాపిస్తే పతనావస్థకు
దిగజారి ప్రలోభాలకు గురైతే
దోషులు కాదు
ఇకపై న్యాయమూర్తులు
భగవద్గీత మీద ఒట్టేసి నిజమే చెప్పాలి
తీర్పులు.. శాస్త్రీయ ఆలోచన
ఆధారమై సజీవ సాక్ష్యమై
కోటి నక్షత్రాల తేజస్సు కలదై ఉండాలి
అనర్థాలని బద్దలు కొట్టాలి
అబద్దాల్ని ఢీకొట్టాలి
మార్గదర్శం, పారదర్శం కావాలి
ఉనికిని నిర్మించుకోలేని
ప్రతిష్టని నిలుపుకోలేని
స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోలేని
తీర్పులేం తీర్పులు
అనుభవజ్ఞానంతో అద్భుత
కూర్పులుగా చేర్చుకోలేని
మార్పులేం మార్పులు
చూసి చూడనట్టు ఉందామా
సంఘటనలు సంఘర్షణలు వీడుదామా
నిందిద్దామా, అవమానిద్దామా
వ్యక్తిగతంగానో సామూహికంగానో
దూషిద్దామా, ద్వేషిద్దామా
స్థానాన్ని మార్పించి క్షమించడమేమిటి
న్యాయస్థానాన్ని ఒప్పించి శిక్షించాలి
కోటం చంద్రశేఖర్
94920 43348
- Tags
- Poem






