కాలం అంతర్మదనం

by Ravi |   (  Updated:2025-04-06 23:45:51  IST  )

Poem

కాలం అంతర్మదనం
X

కాలం పడింది

అంతర్మదనంలో

తన ఊహలకతీత

మార్పు మూలాన్ని

వెతికే తపనలో.

నిన్నటి రాజ్యాలు,

నేటి పాలకులు

వారి మాటలు,

వారి కర్తవ్యాలు,

పోయిన బాటలు

చూపుతూ నిలిచింది.

ప్రకృతిని చూసి,

ప్రాణుల్ని గమనించి,

మనిషి చర్యలతో

హృదయం చలించింది.

తన మార్పుకు

మూలాన్ని వెదుకుతూ

చివరికి తెలుసుకుంది

మార్పుకు మూలం ప్రజలే!

ప్రజల చేతులలోనే

పరివర్తన శక్తి,

ప్రజల హృదయాలలోనే

నూతన గమనం.

నివ్వెరబోయింది కాలం

తన ఎదురులేని

ప్రశ్నకు ప్రజలే

సమాధానమని తెలుసుకొని.

డా మైలవరం చంద్ర శేఖర్

81870 56918

Next Story