- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఆమె పెదవుల మద్య
తడిచిన నీటిచుక్క
చెంపలపై సముద్రమై కురుస్తుంది
నేను దోసిళ్ళలో
శూన్యాన్ని పారబోస్తాను
గుండె గదిపై నుండి
నడిచివెళ్లిపోయే
ఆ పాదాల చప్పుళ్లను
ఏరుకున్న నా చేతులు
అలసిపోవడం ఎరుగవు
ఆమె ఎందుకుందో
ఈ హృదయానికి దగ్గరగా
తెలిసిన పావురం రెక్కలు,
చూసిన అకాశం
ఎప్పుడూ చెప్పవు
పరిమళాలను వెంటాడే గాలి
నీ ఉనికి తెలియకపోతే
నా ఊపిరి ముందు మరణించొచ్చు
నది కళ్ళతో నిన్ను చూశాక
నింగి జరగటం ఓ అర్పితం కావాలి !
గుబ్బల శ్రీనివాస్,
89066 97777
- Tags
- Poem
Next Story






