ఉగాది వసంత స్వాగతం!

by Ravi |   (  Updated:2025-03-31 00:00:47  IST  )

Poem

ఉగాది వసంత స్వాగతం!
X

తెలుగింటి వసంతం

ఉగాది సీమంతం

కళకళలాడే కళావైభవం

తెలుగు ఉగాది స్వాగతం

వేప పువ్వు మామిడి చిగురు

షడ్రుచుల ఉగాది పచ్చడి

పండిత పామరుల పంచాంగ శ్రవణం

తెలుగింటి ఉగాదికి స్వాగతం!

మామిడాకు తోరణాలు

తెలుగింటి వాకిట ముంగిట

ముత్యాల ముగ్గుల స్వాగతం!

తెలుగు ఉగాది వైభవం

ఏటేటా సరికొత్త ధనంతో

విచ్చేసిన ఉగాది

తెలుగు ఉగాదికి స్వాగతం!

శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం

తెలుగు ఉగాది నూతన సంవత్సరం

కవుల కల్పనలో తెలుగు ఉగాది

పండితుల పంచాంగ శ్రవణంలో

తెలుగు ఉగాది

యుగయుగాల పునాది

తెలుగింట కలకలలాడే కలల పంట

నూతన తెలుగు సంవత్సరాదికి స్వాగతం!

విశ్వావసు నామ సంవత్సరానికి

సుస్వాగతం!

ఎల్. ప్రఫుల్ల చంద్ర

6300546700

Next Story