విశ్వావసు ఉగాది

by Ravi |   (  Updated:2025-03-31 00:30:23  IST  )

Poem

విశ్వావసు ఉగాది
X

ఈనాటి ఈ ఉగాది విశ్వావసు

ఇవ్వాలి నవ్య కాంతుల దివ్య తేజసు

మురిసిపోవాలి జగతి సుఖశాంతుల

మునిగిపోవాలి అవని పాడి పంటల

పొంగాలి జనం ఆనంద నందన

అందాలి ప్రకృతి ఫలం ఇంట ఇంటన

నిలవాలి నీతి నిజాయితి నిలువెత్తున

ఎదగాలి మంచి మానవత్వం ఉవ్వెత్తున

ముగియాలి జాతి వివక్ష ద్వేషాలు

మురియాలి మహతి మమతానురాగాలు

కుల వర్ణ వ్యవస్థ కాకూడదు అభివృద్ధికి అడ్డు

మంచి మనసే కావాలి ప్రగతి నావకు తెడ్డు

జీవన పయనం లో కన్నీరు

కావాలి పడతికి పన్నీరు

బతుకు పోరులో నలిగి, మరిగి,

అబల కావాలి సబల తీరు

తెలుసుకోవాలి మహిళే

మనుగడకు ఆధారం అని….

జరుపుకోవాలి ఉగాదే ధరణికి

నవ వత్సర ఆరంభం అని….

- కత్తురోజు అశోక్, అడ్వకేట్

94929 26116

Next Story