విశ్వపు 'రంగులరాట్నం'

by Ravi |   (  Updated:2025-03-30 23:45:12  IST  )

Poem

విశ్వపు రంగులరాట్నం
X

కసికసిగా సాగుతోంది కాలం

వడివడిగా ఒడిసెలరాయి ఇసిరినట్టు

కోపతాపాల దాహంతో

కొరవడిన విలువలతో

నేలకొరుగుతున్న నడి ఈడు

ఛిద్రమవుతున్న సమాజం

వెతుకుతుంది మది ఎతలు తీరే

దారేమైనా దొరుకుతదేమోనని

ఐనా శిశిరంలో రాలే ఆకులేగా సింతలన్నీ

తరం మారుతోంది

తలరాతల నిశీధిలోన

ప్రకృతి మిణుగురుల గమనంలో

యుగాల పయనాలెన్నో

క్రమక్రమంగా ప్రభవించే

అక్షయ దాకా రంగులరాట్నమోలే

మైలురాయిగా నిలిచెనిపుడు 'విశ్వావసు'

కాలచక్రమేదైనా

నడవాలి జీవన చక్రం

ఋతువుల ఆగమానాలు

నిలపాలి నిండు ప్రాణాలు

కాకూడదు పర్యావరణ విధ్వంసం

నిండిపోవాలి ప్రకృతి పచ్చదనం

విశ్వమంతా విరాజిల్లు

సంస్కృతి సౌరభాలు

వసుదైక కుటుంబకమై

నిలవాలీ పరిమళాలు

కమలేకర్ నాగేశ్వర్ రావు

98484 93223

Next Story