- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

చిగురాశలకు నవ పునాది
తెనుగు భాషకు జవ్వాది
తీయ తీయని తలపులతో
నెమ్మదిగా..కదిలేను నా మది...!
ఊరంతా లేత పచ్చదనం
పురులలో చుట్టే పైరు ధనం
నోరంతా పండే ఎర్ర దనం
గోరంతలా చిలిపితనం...!
పసుపు గుమ్మాలకు
మామిడి తోరణాలు
పుత్తడిబొమ్మల మురిపాల
పాదాలకు పారాణులు...!
కోటలోని కోయిలమ్మ గాన కచేరి
కోవెల లోన పంచాంగం చదివేను ఆచారి
తమ ఇంటిలో కూర్చుని
తమ రాశులను చూసుకున్నారు
ప్రజలు మరీమరి...!
ఊరించేను ఉగాది పచ్చడి
ఆబగా తిన్నారు ఆబాల గోపాలం
కొత్త మినుములతో నేతి గారెలు
గుంటూరు కారంతో నంజుకుని తింటే..
అహా..గుండెల..దిరేను..!
పంచె కట్టులతో పడుచు వారు
లంగా ఓణీలలో పల్లె పడుచులు
తరతరాలుగా సనాతన
సంప్రదాయాన్ని చంకనెత్తుకొని..
తెలుగు సంస్కృతిని నిలబెడుతున్నారు...!
ఆరు రుతువుల ఆమని నేడు
అవనికి అరుదెంచె మధుర వాణిలా...!
ఆరో వేలుతో రాస్తున్నా...
నేను కవితను గీర్వాణిలా...!!
జి.సూర్యనారాయణ,
62817 25659.
- Tags
- Poem






