- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
మనస్సు వెలుగు పూలు పూసింది
ఆత్మానందంతో పాటు
పరిశుద్ధతా పరిమళం వెదజల్లింది.
రమజాన్ పుణ్య కాలంలో
విస్తారమవుతున్న ప్రేమ
రమజాన్ కాని కాలంలోనూ
కరుణతో తొణికిసలాడాలి హృదయ సీమ.
ప్రేమ, సహనం, మంచీ, మానవత
ఇదే రమజాన్ సారం
కాంతిలా శాంతితో మన జీవితం
సాగిపోవాలి కలకాలం.
మనదారిలో ఆధ్యాత్మికత
మన ప్రేమలో మానవత
ప్రవక్తల పథం మనకు ప్రేరణ
రమజాన్ శిక్షణ మనకు ధారణ.
సదఖ, ఫిత్రా, జకాతులతో
నిరుపేదల గాయాలకు మలాం
సమాజంలో మానవీయ
పరిమళాలు వెదజల్లిన
రమజాన్ దివ్య మాసమా నీకు సలాం!!
- మదీహా అర్జుమంద్
99125 80645
- Tags
- Poem
Next Story






