ఉగాది పచ్చడి

by Ravi |   (  Updated:2025-03-31 00:15:20  IST  )

Poem

ఉగాది పచ్చడి
X

కోకిలమ్మ శ్రావ్యమైన పాటతో

మావి చిగురు ముస్తాబుతో

వసంత మాసపు చల్లని గాలితో

మొదలవుతుంది ప్రకృతి పరవశం

నవ్వుతూ పచ్చని దుప్పటి

కప్పుకుంటుంది ఉగాది

నూతన పరిమళంతో ఆహ్వానించే చెట్లు

విషాదపు గ్రీష్మం పక్కకు జరిగి

కెరటాలు నృత్యం చేస్తాయి

ఆరు రుచుల ఉగాది పచ్చడి

చేదు, వగరు, పులుపు, తీపి,కారం

రుచికరమైన ఉగాది పచ్చడి

జీవిత సత్యం చెప్పే పచ్చడి

మనిషి చేతిలో చేయి కలిపిన ఉగాది

స్వార్థంతో చేతులు వదిలేసిన నేటి మనిషి

సరిహద్దుల్ని గీసిన నాయకులు

వారూ వీరూ తగాదాలు

హిందూ ముస్లిం గోడలు

సమ్మేళనంలోనే బలం

ఉందని చెబుతోంది ప్రకృతి

విడితనాలూ విద్వేషాలూ

కాకూడదు సంస్కృతి

సర్వమంగళ

89616 26848

Next Story