సృష్టి లేదు నేడు చూద్దామన్నా

by Ravi |   (  Updated:2025-03-23 23:45:35  IST  )

Poem

సృష్టి లేదు నేడు చూద్దామన్నా
X

కిర్రు జోల్ల చెప్పులు

కిన్నెర మోత నాదాలు

మట్టిపై మనిషి కాళ్ళ కింద

పాదాలు మోపుతుంటే

పలుకు శబ్దాలు

పళ్ళు కొరికినట్టుగా

పాదరక్ష కుల సప్పుడు

కోరా మీసాలు పెట్టుకోని

తెల్ల పంచ కట్టుకొని

కర్ణం కళ్ళ కింద

పట్టేండ్ల పాదాల కింద

మ్యాతరి పాదాలకు

కర్ర చేసిన చెప్పులు

కళ్ళకింద పరుపు దిండ్లు

కిర్రుం కిర్రుం శబ్దాల చెప్పులు

సృష్టి లేదు నేడు చూద్దామన్నా

దేవరపాగ కృష్ణయ్య

99634 49579

Next Story