- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
కనువిందైన పుష్పమా
వినసొంపైన కావ్యమా
అలరించే మకుటమా
వెదజల్లే పరిమళమా
సెదతీర్చే పవనమా
అందమైన కపోతమా
అలుపెరుగని ప్రవాహమా
ఎద దూరిన శిల్పమా
కసురుకొనుట భావ్యమా
మౌనమే నీ భాష్యమా
ఊహలోని భావమా
చితిని పేర్చ న్యాయమా
నా కలల ప్రియతమా
మరచి పోలేని నేస్తమా
చెలిమి కోర నేరమా
శ్వాస నిలిపే ప్రాణమా
నవరసాల కుందనమా
భువి చేరిన పారిజాతమా
అణుఅణువులో సంబరమా
చత్రమై నిలిచే చైతన్యమా
నమిలకొండ నాగేశ్వర్ రావు
86885 53470
- Tags
- Poem
Next Story






